జ్యోతిబాసు వై కోసం ప్రొఫైల్ ఫోటో

లింక్డ్ఇన్ ఒక సామాజిక మాధ్యమం ఫేస్బుక్, ట్విట్టర్ లాగా, కాకపోతే వృత్తి సంబంధాలు నిర్వహించుకోవడానికి వాడతారు.

లింక్డ్ఇన్ వెబ్సైటు లేదా యాప్ లో మీ ఎకౌంట్ తెరవచును.

ఇక ప్రొఫైల్ రెండు రకాలుగా ఉంటుంది - పబ్లిక్ ప్రొఫైల్ లో ఎక్కువ సమాచారం పెట్టకండి. ఈ రోజుల్లో గూగుల్ టాప్ 3 ఫలితాల్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ వస్తున్నాయి.

కనెక్షన్స్ చూసే ప్రొఫైల్ లో వివరాలు పెట్టండి.

ప్రొఫైల్ లో ముఖ్యమైనవి -

  • టైటిల్ : కేవలం "హోదా - సంస్థ" అని కాకుండా ఆకట్టుకునే విధంగా ఉండాలి.
  • About గురించి: ఇక్కడ మూడు నాలుగు పంక్తులలో క్లుప్తంగా మీ అనుభవం, మీ అచీవమెంటస్ పెట్టండి. అంతే గానీ tell me about yourself అని సుత్తి కొట్టకండి. రేజ్యుమేలోలా మొత్తం వ్రాయనక్కరలేదు.
  • అనుభవం: ప్రతి సంస్థలో ప్రతి హోదా పెట్టొచ్చు, లేదా సంస్థకు ఒక ఎంట్రీ చొప్పున ఇవ్వచ్చు. మీరు ఎన్ని సంస్థలు/హోదా లు మారారు అన్నదాన్ని బట్టి ఇవి చూపించుకొండి.
  • ప్రతి హోదాలో మీరు చేసిన ముఖ్యమైన పనులు (టాస్క్స్) పెట్టండి.
  • ఎండార్స్మెంట్ లు, రికమండేషన్ లు తెలిసినవారితో ఇప్ప్పించుకొనండి.
  • దయ చేసి టీవి చూస్తాను, క్రికెట్ ఆడతాను లాంటివి హాబీలుగా పెట్టకండి.

ముందే చెప్పినట్లు లింక్డ్ ఇన్ వృత్తి సంబంధాలకు కాబట్టి కనెక్షన్లు ఒకటికి రెండుసార్లు చూసుకొని కలుపుకోండి. హెచ్ ఆర్ వాళ్ళు, కన్సల్టెన్సీ వారు మనకు ఇన్విటేషన్లు పంపించి, మనద్వారా మన కనేక్షన్లు ఇలా వారి నెట్వర్క్ పెంచుకుంటారు.

సరిగ్గా వాడుకుంటే మన నెట్వర్క్ పెంచుకోవడానికి, పాత సంస్థ ల ఉద్యోగులతో టచ్లో ఉండడానికి, ఉద్యోగ అన్వేషణకు ఉపయోగపడుతుంది.

ప్రశ్నను చూడండి