జ్యోతిబాసు వై కోసం ప్రొఫైల్ ఫోటో

అఆ లూ, గుణింతాలూ అందరు నేర్చుకుంటారు. నేర్చుకున్న చాలామంది వ్యాసాలు రాయగలరు , సోషల్ మీడియాలో పోస్ట్ వరకు రాగలరు. కొందరే కథలు , కవితలు రాయగలరు.

అలాగే ప్రోగ్రామింగ్ అంటే కేవలం సింటాక్స్ నేర్చుకోవడం కాదు. లాజిక్కు రాయగలగాలి. ఆ లాజిక్ సంక్లిష్టత నిజ జీవితంలో వాడే అప్లికేషన్స్, సిస్టమ్స్ రచించేటప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. హలో వరల్డ్ ప్రోగ్రామ్స్ వ్రాసినంత తేలిక కాదు. విజయవాడ-గుంటూరు వంటి చిన్న ఊళ్ళలో కూడా రెండు వేలు, మూడు వేలకు వెబ్సైట్ తయారు చేసి పెడతారు. కానీ ఆ వెబ్ సైట్లు సంక్లిష్టత వేరు ఐసిఐసిఐ బ్యాంక్, ఫేస్బుక్ వంటి కొన్ని వేల-మిలియన్ల యూజర్లు వాడే వెబ్సైటు సంక్లిష్టత వేరు. బ్యాంకులు, ట్రేడింగ్, ఇన్సూరెన్స్ వంటి సంస్థల అప్లికేషన్లలో కేవలం సంక్లిష్టతేకాదు, ట్రాన్సాక్షన్స్ అటు ఇటు అయినా పర్ఫామెన్స్ మారినా చాలా ఆర్ధిక నష్టం, పరువు నష్టం ఉంటాయి. RBS fined £56m over 'unacceptable' computer failure - ఈ బ్యాంకు ప్రాజక్టులో పని చేసినవారు నాకు తెలుసు.

అలాగే ఐ ఫోన్స్ రిక్వెస్ట్ చేసే ఆపిల్ సైటు ఉంది దాని పర్ఫామెన్స్ ఆర్కిటెక్చర్ తయారుచేసిన ఆర్కిటెక్ట్లు ,వ్రాసిన డెవలపర్లు, టెస్టర్లు నాకు వ్యక్తిగతంగా తెలుసు. అది కేవలం ప్రోగ్రామింగ్ సింటాక్స్ లు తెలిస్తే చేసే పని కాదు.

ఒక వెబ్ సైట్ హోం పేజి రెస్పాన్స్ టైం 2 సెకన్లు తగ్గించడానికి, ఒక స్టోర్డ్ ప్రొసీజరు ఎగ్జిక్యూషన్ సమయం 500 మిల్లీ సెకన్లు తగ్గించడానికి నేను పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇవి అమీర్పేటలో లేదా యూడెమీ, కోర్స్ ఎరా వంటి ఆన్లైను శిక్షణా సంస్థలలో వారం రోజులు కోర్సులు చేసితే వచ్చే నైపుణ్యం కాదు.

ఐటీ లో కేవలం రెండు మూడేళ్లు పనిచేసిన వారు, లేదా ఐటీకి సంబంధం లేని వారు ఇండియన్ సర్వీస్ కంపెనీలనీ, అందులో పనిచేసే వారిని చిన్నబుచ్చుతున్నారు గాని ఇలాంటి క్లిష్టమైన ప్రాజెక్టులలో పని చేసేవాళ్ళు బాగానే ఉంటారు ఇలాంటి కంపెనీలలో .

ఇక రెండవ కారణం బిజినెస్ / డోమైన్‌ జ్ఞానం కావాలి . ఉదాహరణకి ఇన్సూరెన్స్ డొమైన్ లో పనిచేసేవారికి క్లైమ్ ఎలా ప్రాసెస్ జరుగుతాయి , ఒక పాలసీ ఇష్యూ చేయడానికి ఏమేం కావాలి వంటివి తెలిస్తేనే సరిగ్గా ప్రోగ్రాం రాయగలరు.

మూడవది క్వాలిటీ - మనం రాసే కోడ్ కొన్ని ఏళ్ళపాటు మన తర్వాత వచ్చేవారూ అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ప్రమాణాలు (స్టాండర్డ్స్) పాటించాలి.

ఇంకా చాలా ఉంటాయి - NFR - అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్లు - సెక్యూరిటీ, స్కేలబిలిటీ, మెయింటెయినబిలిటీ లాంటివి - పాటించాలి.

ఈ ప్రశ్నకు 10 ఇతర సమాధానాలను చూడండి